వైరల్: భర్త చనిపోయిన రెండేళ్లకు మామను పెళ్లి చేసుకున్న యువతి... 

వైరల్: భర్త చనిపోయిన రెండేళ్లకు మామను పెళ్లి చేసుకున్న యువతి... 

ఛత్తీస్ గడ్ లోని బిలాస్పూర్ లో గౌతమ్ సింగ్, ఆర్తి సింగ్ అనే దంపతులు నివసిస్తున్నారు.  కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది.  అయితే, ఆర్తి సింగ్ భర్త గౌతమ్ సింగ్ హఠాత్తుగా రెండేళ్ల కిందట మరణించాడు.  భర్త మరణించిన తరువాత భార్య ఆర్తి సింగ్ మామగారింట్లోనే ఉన్నది.  అయితే మామగారిది రాజ్ పుత్ వంశస్తులు. 

రాజ్ పుత్ వంశంలో  స్త్రీలు పెద్దగా బయటకు రారు.  రెండేళ్ల పాటు ఆర్తి సింగ్ ఇంట్లోనే ఉండిపోయింది.  అయితే, క్షత్రియ ఆచారం ప్రకారం మహిళలకు పునర్వివాహం చెయ్యొచ్చు.  ఇదే విషయాన్ని  ఆర్తి సింగ్ మామ  కృష్ణా రాజపుత్ సింగ్ క్షత్రియ మహాసభ కమ్యూనిటీ ముందుకు తీసుకొచ్చారు.  రెండేళ్లుగా మామ తనను చూసుకుంటున్న తీరు నచ్చి ఆ యువతి మామను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది.  దీంతో క్షత్రియ సంప్రదాయం ప్రకారం కొద్దిమంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు ఛత్తీస్ గడ్ లో వైరల్ గా మారింది.