భారత భవిష్యత్తు నిర్ణయించేది శ్రీలంక...

భారత భవిష్యత్తు నిర్ణయించేది శ్రీలంక...

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు టెస్టుల సిరీస్ కోసం జూలై-ఆగస్టులో బంగ్లా జట్టు,  అంతకంటే ముందు మూడు వన్డేలు మరియు టీ 20ల కోసం జూన్-జూలైలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అయితే శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) భారత్ మరియు బంగ్లాదేశ్ రాబోయే పర్యటనలపై ఈ వారం చివర్లో నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. "రెండు క్రికెట్ బోర్డులు (బీసీసీఐ మరియు బీసీబీ) పరిస్థితిని అంచనా వేయడానికి మే 15 వరకు సమయం కావాలని శ్రీలంక క్రికెట్ కోరింది. భారత, బంగ్లా పర్యటనల పై ఈ వారం చివరిలో మేము సమిష్టి నిర్ణయానికి వస్తాము" అని ఎస్‌ఎల్‌సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ''ఆష్లే డి సిల్వా'' చెప్పారు. అయితే పర్యటనలు కార్యరూపం దాల్చకపోతే, కరోనా మహమ్మారి కారణంగా ఇది వరుసగా రద్దు చేయబడిన శ్రీలంక యొక్క మూడవ హోమ్ సిరీస్ అవుతుంది. అయితే శ్రీలంకలో ఇప్పటివరకు 875 పాజిటివ్ కరోనావైరస్ కేసులు తొమ్మిది మరణాలతో నమోదయ్యాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.