ఈ సారి కోహ్లీ వంతు...

ఈ సారి కోహ్లీ వంతు...

ఐపీఎల్ 2018లో అభిమానులు భద్రతా సిబ్బందిని దాటి తమ అభిమాన క్రికెటర్ల పాదాలను తాకడం చూస్తున్నాం. ఈ మధ్యనే మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డౌగ్ అవుట్ లో సహచర ఆటగాళ్లతో మాట్లాడుతున్న సమయంలో.. ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని వచ్చి ధోని పాదాలను తాకి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే ఈ సారి కోహ్లీ వంతు వచ్చింది.

శనివారం ఢిల్లీ, బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో.. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా సడెన్‌గా ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లపై పడి అతని కాళ్లు మొక్కడు. అంతటితో ఆగకుండా విరాట్‌తో సెల్ఫీ కూడా దిగాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని దూరంగా తీసుకెళ్లారు. అతన్ని ఏమీ అనొద్దంటూ కోహ్లి సూచించడం కొసమెరుపు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం 40 బంతుల్లో 70 పరుగులు చేసి బెంగుళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

Photo: FileShot