ట్రెండింగ్‌కు గుడ్‌బై... బ్రేకింగ్‌ న్యూస్‌ వస్తోంది

ట్రెండింగ్‌కు గుడ్‌బై... బ్రేకింగ్‌ న్యూస్‌ వస్తోంది

ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. నాలుగేళ్లపాటు  నడిపినా పెద్దగా రెస్పాన్స్‌ రాకపోవడంతో ట్రెండింగ్‌ సెక్షన్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఈ సెక్షన్‌ స్థానంలో 'బ్రేకింగ్‌ న్యూస్‌' పేరుతో ఓ ఫీచర్‌ మొదలు పెట్టాలని.. ఇందులో ప్రాంతీయ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు కంపెనీ వర్గాలను పేర్కొంటున్నాయి. బ్రేకింగ్‌ న్యూస్‌ సెక్షన్‌ను ఇప్పటికే అమెరికాలో పరీక్షిస్తోందని.. దాదాపు 44 శాతం మంది యూజర్లు ఫేస్‌బుక్‌ నుంచి న్యూస్‌ పొందుతున్నారని కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి.