ఫేస్‌బుక్‌లో మీ డేటా ఇక సేఫ్.. ఎలాగంటే..?

ఫేస్‌బుక్‌లో మీ డేటా ఇక సేఫ్.. ఎలాగంటే..?

కోట్లాదిమంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు విక్రయించిందన్న ఆరోపణలపై ఫేస్‌బుక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ వినియోగిస్తున్న వారంతా తమ సమాచారం భద్రంగా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు చేజారిపోకుండా ఫేస్‌బుక్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఒక కొత్త టూల్‌ను తీసుకురాబోతోంది. నిన్న జరిగిన కంపెనీ వార్షిక డెవలపర్ల సదస్సులో ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు గతంలో సందర్శించిన వెబ్‌సైట్లలోని వివరాలను ఇతరులెవరూ పొందలేరు. ఈ టూల్‌ను ఉపయోగించి యూజర్ గతంలో ఏయే వెబ్‌సైట్, యాప్స్‌లో సమాచారం వినియోగించారో తెలుసుకుని.. క్లియర్ చేసి తమ సమాచారాన్ని తొలగించుకోవచ్చని జుకర్‌బర్గ్ తెలిపారు.