ఫేస్ బుక్ కామెంట్ పై పంచాయితీ...

ఫేస్ బుక్ కామెంట్ పై పంచాయితీ...

ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోయినా ఫొటోలు దిగి ఫేస్ బుక్, వాట్స్ ఆప్ లలో పెట్టడడం ఇప్పటి యువతకు అలవాటు. ఎవరికి ఎన్ని లైక్స్, కామెంట్స్ వస్తే అంత గొప్పగా  ఫీల్ అవుతారు. ఇక కామెంట్స్ తేడాగా వస్తే పరిస్థితి ఎక్కడికి పోతుందో తెలియదు. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం రామునిపాలెంలో చోటుచేసుకుంది. రామునిపాలెంకు చెందిన శ్రీనివాస రావుకు ఈ నెల మొదటి వారంలో వివాహం అయింది. మ్యారేజ్ ఫ్లెక్సీని శ్రీనివాస రావు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. దీనిపై ఫ్రెండ్స్ కామెంట్స్ రాశారు. అందులో ఒకరు కాస్త వ్యంగంగా కామెంట్ రాసాడు. దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు శ్రీనివాస రావు ఆగ్రహంతో విషయాన్ని గ్రామ  పెద్దలకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తిని, అతనికి సహకరించిన వారిని పిలిపించి పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో ముగ్గురినీ చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. సమాచారం  తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని విడిపించి.. కేసు నమోదు చేశారు.