ఖబడ్దార్... నాలుకలు తెగుతాయి...

ఖబడ్దార్... నాలుకలు తెగుతాయి...

'రైతు బంధు' పథకంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి... ఈ పథకం ఎన్నికల గిమ్మిక్కే అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తుండగా... అధికార పక్షం సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది. మరోవైపు రైతు బంధు పథకం డబ్బుతో రైతులు బీర్లు తాగుతున్నారన్న వార్తలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్... విపక్షాల సంస్కారహీనమైన మాటలకు సిగ్గుపడుతున్నామని వ్యాఖ్యానించారు. రైతులకు డబ్బులు ఇస్తే బీర్లు తాగుతారు అంటూ... నీచంగా మాట్లాడే నేతల్లారా ఖబడ్దార్... మీ నాలుకలు తెగుతాయని హెచ్చరించారు మంత్రి ఈటల. కాంగ్రెస్‌ హయాంలో స్కామ్‌లతో నేతలు దోచుకుంటే... తాము అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.