వెంకటేష్ చిన్నకూతురు ఇంతలా మారిపోయిందా ...!!

వెంకటేష్ చిన్నకూతురు ఇంతలా మారిపోయిందా ...!!

సినిమా పరిశ్రమల్లో కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా , హీరోయిన్లుగా మారిపోతుంటారు . 2014లో వచ్చిన దృశ్యం సినిమాలో వెంకటేశ్‌ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్  విషయం లోను అదే జరిగింది. ఆ సినిమా వచ్చి సరిగ్గా ఆరు సంవత్సరాలు అయ్యింది. ఆ సినిమాలో చిన్న పాపగా కనిపించిన ఎస్తేర్ ఇప్పుడు అంటే ఆరు సంవత్సరాల తర్వాత చూస్తే హీరోయిన్ రేంజ్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని గ్లామర్ ఫోటోలు నెటీజన్‌లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మలయాళం ఆడియన్స్‌కి ఆమె రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా టచ్‌లో లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్ గా నటించేందుకు రెడీ అవుతుంది . 18 ఏళ్ల ఎస్తేర్ కు ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయట.