ఇంగ్లాండ్ ఆటగాళ్ల జెర్సీల పైనా భారత డాక్టర్ల పేర్లు.. 

ఇంగ్లాండ్ ఆటగాళ్ల జెర్సీల పైనా భారత డాక్టర్ల పేర్లు.. 

సౌతాంప్టన్ లో ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తో కరోనా కారణంగా వచ్చిన 117 రోజుల విరామం తరువాత అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ధరించిన  జెర్సీల పైనా భారత డాక్టర్ల పేర్లు ఉన్నాయి.  ఎందుకంటే... ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యతిరేకంగా క్రికెట్ ఇంగ్లాండ్ వినూత్నంగా  కరోనా  వారియర్లకు తమ సంఘీభావాన్ని  ప్రకటించింది వారి సేవలకు గౌరవార్ధం  వారి పేర్లను ఆటగాళ్లు తమ జెర్సీలపై వేసుకున్నారు.  ఇలాగే ఇంతకముందు అట మొదటి రోజున వెస్టిండీస్ ఆటగాళ్లు జాతి వివక్షతకు వ్వతిరేకంకా జరుగుతున్నబ్లాక్ లైవ్స్ మేటర్  ఉద్యమానికి మద్దతు తెలిపారు . ఇక ఇంగ్లాండ్ లో 'రైజ్‌ ది బ్యాట్'‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్‌‌లో ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్  బెన్‌స్టోక్స్‌ ఇండియాకు చెందిన డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ పేరుతో ఉన్న జేర్సిని ధరించాడు. డాక్టర్ వికాస్ డార్లింగ్టన్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)  ట్రస్టులో కరోనా బాధితుల కోసం పనిచేస్తున్నారు, ఆయనతో పాటు మన భారత సంతతికి చెందిన మరో ముగ్గురు  డాక్టర్ల  పేర్లు ఉన్న జేర్సిలకు కూడా ఆటగాళ్ళ ధరించారు.