ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం

ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం పాలయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. రాత్రి రెండు గంటలకు ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు ఆయనను ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయనను ఆసుపత్రికి తరలించేప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సినీ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావుకు బడేటి బుజ్జి మేనల్లుడు. 2004 లో బుజ్జి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఏలూరు మున్సిపల్ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2014 లో టీడీపీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బడేటి బుజ్జి మృతితో జిల్లా టీడీపీ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది. ఆయన మరణం పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి తీరని లోటు అనే చెప్పాలి. గత ఎన్నికల్లో మాత్రం 4072 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చేతిలో బడేటి బుజ్జి ఓటమి పాలయ్యారు.