వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ : ఈటెల రాజేందర్ కీలక ఆదేశాలు 

వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ : ఈటెల రాజేందర్ కీలక ఆదేశాలు 


ఈరోజు బీఆర్కే భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న టెర్శరీ కేర్ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించిన మంత్రి, గాంధీ ఆసుపత్రితో పాటు మిగతా హాస్పిటల్స్ కి కూడా పాజిటివ్ వ్యక్తులను పంపించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసిన టిమ్స్, కింగ్ కోటిలో కూడా చికిత్స అందేలా చూడాలని మంత్రి కోరారు. అన్ని జిల్లాల అధికారులకు కూడా ఈ సమాచారం అందిచాలని అధికారులను ఆదేశించారు. 

మెడికల్ కాలేజీల సేవలను  కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించిన ఆయన హైదరాబాద్ నలుమూలలా మెడికల్ కాలీజీలు విస్తరించి  ఉన్నాయి కాబట్టి అక్కడ  వైద్యం అందేలా చూడాలని కోరారు. మల్లారెడ్డి, మమత, RVM, MNR, అపోలో, కామినేని మెడికల్ కాలేజీలలో పాజిటివ్ పేషంట్లకు పూర్తి స్థాయి వైద్యం అందేలా చూడాలని కోరారు. జిల్లా స్థాయి వరకు వికేంద్రీకరణ చేసుకొని చికిత్స అందేలా చూడాలని కూడా ఆయన అధికారులను కోరారు. అత్యవసర పరిస్థితి ఉన్న పేషంట్లను మాత్రమే హైదరాబాద్ కు పంపించాలని జిల్లా అధికారులను సూచించారు. 

 లక్షణాలు లేని వారందరినీ హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలని, ఆ అవకాశం లేని వారికి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఐసోలేషన్ లో ఉండేలా చూడాలని సూచించారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సిజెన్ సదుపాయం అందుబాటులో ఉంది కాబట్టి అక్కడే చికిత్స అందిచాలని మంత్రి కోరారు.