తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, టీడీపీ దగా చేశాయి

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, టీడీపీ దగా చేశాయి

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దగా చేశాయని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, మహా కూటమి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారనే సందేశాన్ని ఇవ్వాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. గతంలో ఎందుకు రూ. 2 వేల పెన్షన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే గుడ్డిగా హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. రూ. కోటి సీడీఎఫ్ నిధులపై గత పాలకులు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వలేదని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 3 కోట్ల సీడీఎఫ్ నిధులపై ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. గతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే నిధులు ఇచ్చేవారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని ఈటెల తెలిపారు.