ఈ నగరానికి ఏమైంది ట్రైలర్ రివ్యూ 

ఈ నగరానికి ఏమైంది ట్రైలర్ రివ్యూ 

పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయం సాధించి అందరి కళ్ళలో పడ్డ దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతో అంతటి ఘన విజయం సాధించడంతో రెండో సినిమా ఎప్పుడు తీస్తాడా అని తెగ వెయిట్ చేశారు. ఇక ఇవాళే తన తదుపరి చిత్రం ఈ నగరానికి ఏమైంది మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు అలరించిందో చూసేద్దామా. 

తరుణ్ భాస్కర్ ఈ సినిమాని కొత్త వాళ్ళతో తెరకెక్కించి తాను అనుకున్న ఫన్ ఎలిమెంట్ ని బాగా జెనెరేట్ చేశాడు. నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ తన లైఫ్ గోల్స్ ని ఎలా తీర్చుకున్నారు..ఈ ప్రయాణంలో ఎదురైన ఘటనలను హాస్యాస్పదంగా చూపించారు. సినిమాలో ఉన్న ఈ నాలుగు క్యారెక్టర్స్ కొత్తవి కావడంతో వాళ్లు చేసిన న్యాచురల్ యాక్టింగ్ మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంది. నేటి తరం యువత లైఫ్ స్టైల్ కి అద్ధం పట్టేలా న్యూ టాలెంట్ ని తరుణ్ ఇందులో చూపించనున్నారు. ఫీమేల్ లీడ్ అనిషా అంబ్రోస్ ఇది వరకే కొన్ని సినిమాల్లో నటించడంతో కాస్త మనకు పరిచయమే. ఈ సినిమాలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గౌతమ్, వెంకటేష్ కాకుమాను లు కీలక పాత్రలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. నిర్మాత సురేష్ బాబు పాటించిన నిర్మాణ విలువలు మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.