ఈసీ కీల‌క నిర్ణ‌యం.. వాళ్ల‌కు లేదు.. వీళ్ల‌కు మాత్ర‌మే పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యం..!

ఈసీ కీల‌క నిర్ణ‌యం.. వాళ్ల‌కు లేదు.. వీళ్ల‌కు మాత్ర‌మే పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యం..!

బీహార్ సార్వత్రిక ఎన్నికలు, సమీప భవిష్యత్తులో నిర్వహించాల్సిన ఉప ఎన్నికలలో 65 ఏళ్లు దాటిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఇవ్వరాదని నిర్ణ‌యం తీసుకుంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. క‌రోనా కార‌ణంగా అనుసరించాల్సిన భద్రతా పరమైన నియమాలు,  మానవ వనరులతో పాటు, ఇత‌ర సదుపాయాలకున్న పరిమితులు, కొరతల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. అయితే, హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా పాజిటివ్ రోగులు, అత్యవసర సేవలందించే వారు, ప్రభుత్వ పనుల విభాగంలో పని చేసే వారు, 80 ఏళ్ల పైబడిన వారు మాత్రం పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యం ఉప‌యోగించుకునే వెసులుబాటు క‌ల్పించింది. 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మే 17వ తేదీన జారీ చేసిన “లాక్ డౌన్” మార్గదర్శకాలలో పేర్కొన్న మేరకు 
60 ఏళ్లు పైబడిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాం...కానీ, ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు ను వినియోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది... ‌దీంతో.. 60 ఏళ్ల పైబడిన వారు, ఇత‌ర ఇబ్బందులుండే ఓటర్లు కూడా చాలా సులభంగా, ఏలాంటి కష్టం లేకుండా ఓటు వేసే అవకాశం ఏర్పడింది... బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 34 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది... గ‌తంలో కంటే, 45 శాతం పోలింగ్ కేంద్రాలను అదనంగా పెంచడంతో, రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య ఒక లక్ష ఆరు వేలకు పెర‌నుంది.. దీనికోసం పోలింగ్ సిబ్బందిని, ఆ మేరకు పెద్ద సంఖ్యలో వావహనాలను స‌మ‌కూర్చాల్సి ఉంటుంది.. కాబట్టి, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత 60 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించరాదని నిర్ణయం తీసుకున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.