తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

తెలుగురాష్ట్రాలో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భూమి కంపించింది. జగ్గయ్యపేటలో అర్థరాత్రి 8 సెకన్లపాటు  భూమి కంపించింది. భయాందోళనతో ఇళ్లనుంచి ప్రజలు పరుగులు తీశారు. జగయ్య పేట, గండ్రాయి, చిల్లకల్లు, బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరంలో భూమి కంపించింది. అర్ధరాత్రి 2.38 నిముషాలకి భూప్రకంపనలు సంభవించాయి. అటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోనూ భూమి కంపించింది. సూర్యాపేటలో అర్థరాత్రి 2.37 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయని ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.