ఢిల్లీలో మళ్ళీ భూప్రకంపనలు..ఆందోళనలో ప్రజలు.!

ఢిల్లీలో మళ్ళీ భూప్రకంపనలు..ఆందోళనలో ప్రజలు.!

దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.  3.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే లోతు చాలా తక్కువగా ఉన్నందున భూకంప ప్రభావం, నష్టం పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు.సరిగ్గా 9 గంటల 8 నిముషాల 40 సెకండ్ల కు భూకంపం సంభవించినట్లు నమోదయ్యింది. దీనివల్ల ఢిల్లీ, నోయుడా హర్యానా లలో భూప్రకంపనల ప్రభావం కనిపించింది. హర్యానా లోని రోహతక్ కు ఆగ్నేయ దిశగా 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.కాగా రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 4.6 గా ఉన్నట్టు అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఇక ఢిల్లిలో గత నెల రోజుల్లో భూమి కంపించడం ఇది రెండోసారి వరుస భూప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.