నేడే తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు

నేడే తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు విడుదలకానున్నాయి. సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఏడాది ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,36,311 మంది, అగ్రికల్చర్‌ పరీక్షకు 66,857 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 2 వరకు రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.  జూన్‌ 8న మొదటి దశలో సీట్లు కేటాయిస్తారు.