శిక్షణ కోసం బిఎమ్‌డబ్ల్యూని అమ్మేస్తున్నా ఒలంపిక్ అథ్లెట్...

శిక్షణ కోసం బిఎమ్‌డబ్ల్యూని అమ్మేస్తున్నా ఒలంపిక్ అథ్లెట్...

కరోనా వైరస్ మహమ్మారి మధ్య తన శిక్షణ ఖర్చుల కోసం భారతదేశపు అత్యంత వేగవంతమైన మహిళ రన్నర్ ద్యుతీ చంద్ తన బిఎమ్‌డబ్ల్యూని ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. అయితే, తరువాత కొద్ది సమయానికి ఆమె ఈ పోస్ట్‌ను తొలగించింది. ద్యుతీ 2015 బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ మోడల్‌ను కలిగి ఉంది, ఆమె దీనిని రూ .30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఇప్పుడు తన శిక్షణ ఖర్చుల కోసం తన కారును అమ్మడానికి సిద్దమైంది. ''ఈ కరోనా మహమ్మారి కారణంగా ఏ స్పాన్సర్ నా కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేడు. నాకు డబ్బు అవసరం ఉంది మరియు నేను టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్నప్పుడు నా శిక్షణ మరియు ఆహార ఖర్చుల కోసం దానిని అమ్మాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. అయితే ఆవిడ ఈ కారును ఆసియా క్రీడలలో బంగారు పథకం సాధించినందుకు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ అందించిన 3 కోట్ల రూపాయలు బహుమతి ద్వారా కొన్నట్లు చెప్పారు. 

అయితే తాను ఆన్లైన్ లో ఈ పోస్ట్ చేసిన తరువాత, ఆమెకు సహాయం చేయడానికి ప్రభుత్వ ముందుకు వచ్చిందని దాంతో ఆ పోస్ట్ ను తీసేసినట్లు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే ఆమె శిక్షణ కోసం ప్రభుత్వం రూ .50 లక్షలు మంజూరు చేసింది, కోచ్, ఫిజియోథెరపిస్ట్స్, డైటీషియన్ జీతాలతో సహా ఆమె శిక్షణ కోసం నెలకు సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది ఒరిస్సా ప్రభుత్వం. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.