బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించిన కారు

బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించిన కారు

 హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు నెంబర్ వన్ జీవీకె సెంటర్ చౌరస్తాలో ఓ కారు అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగివున్న మరో కారును ఢీకొట్టింది. ఫుట్ పాత్ పై ఉన్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది వైపుగా దూసుకెళ్లింది. వారు వెంటనే పరుగులు తీయడంతో పెనుప్రమాదం తప్పింది. నిందితులు అత్తాపూర్‌కు చెందిన షోయబ్, రియాన్, జబ్బార్‌గా అధికారులు గుర్తించారు. మద్యం తాగి కారు నడిపినట్టుగా స్థానికులు చెప్తున్నారు.