దాస‌రి విగ్ర‌హావిష్క‌ర‌ణ అతిధులు వీరే..

దాస‌రి విగ్ర‌హావిష్క‌ర‌ణ అతిధులు వీరే..

ద‌ర్శ‌క‌ర‌త్న, దివంగ‌త‌ డా.దాస‌రి నారాయ‌ణ‌రావు విగ్ర‌హావిష్క‌ర‌ణకు ముహూర్తం ఖ‌రారైంది. నేటి సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఫిలింన‌గ‌ర్ సొసైటీ కాంప్లెక్స్ ప‌రిస‌రాల్లో దాస‌రి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల దంప‌తులు ముఖ్య అతిధులుగా విచ్చేయ‌నున్నారు. ఇదే వేడుక‌లో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స‌హా ప‌లువురు సినీ,రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన‌నున్నార‌ని తెలుస్తోంది.

 డా.దాస‌రి నారాయ‌ణ‌రావు తొలి జ‌యంతి వేడుక‌ల్ని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డ‌మే గాకుండా.. ఆయ‌న‌కు అద్భుత‌మైన కాంస్య విగ్ర‌హాన్ని శిష్యులు త‌యారు చేయించ‌డంపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అలానే దాస‌రి ప్రియ‌శిష్యుడు నిర్మాత సి.క‌ళ్యాణ్ గురువుగారిపై బ‌యోపిక్ నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు త‌దిత‌రులు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ కార్య‌క్ర‌మాల్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.