వైజాగ్‌ని చాలా మిస్‌ అవుతున్నా : అండ్రూ ఫ్లెమింగ్‌

 వైజాగ్‌ని చాలా మిస్‌ అవుతున్నా : అండ్రూ ఫ్లెమింగ్‌

కరోనా కారణంగా మూడు నెలలుగా వైజాగ్ నగరాన్ని చాలా మిస్‌ అవుతున్నాననని తెలుగు రాష్ట్రాల యూఎస్‌ డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్‌ అన్నారు. "విశాఖ తీరం చిత్రమిది. చాలామంది వైజాగ్‌ అని పిలుచుకునే ఈ సిటీ ఆఫ్‌ డెస్టినీ..ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం. అంతేకాదు..అత్యధికమంది అంతర్జాతీయ ఉద్యోగులున్న హెచ్‌ఎస్‌బీసీ విశాఖలో ఉంది. కరోనా కారణంగా మూడు నెలలుగా ఈ సుందరమైన నగరాన్ని చాలా మిస్‌ అవుతున్నాను" అంటూ ఆయన ట్వీట్ లో వైజాగ్ ను వర్ణించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ తీరానికి సంబందించిన ఒక అందమైన చిత్రాన్ని పోస్ట్ చేసారు. గతంలోను అండ్రూ ఫ్లెమింగ్ వైజాగ్ గురించి ట్వీట్ లు చేసారు. ఇక ఇప్పుడు ఆయన ట్వీట్ కు నెటిజన్లు లైక్ లు, కామెంట్లు చేస్తున్నారు.