ఆ తుపాకీ టాటూతో  ప్రపంచకప్ ఆడకండి

ఆ తుపాకీ టాటూతో  ప్రపంచకప్ ఆడకండి

రష్యాలో 32 దేశాలతో ఫిఫా పుట్ బాల్ ప్రపంచకప్ పోటీలు మరో 15రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆయా దేశాల జట్లు రష్యా చేరుకొని కసరత్తులు మొదలెట్టాయి. షెడ్యూల్‌ ను  అనుసరించి ఇంగ్లాండ్‌ జట్టు కూడా ప్రాక్టీస్‌లో పాల్గొంది. ఆ టీంలో  రహీమ్‌ స్టెర్లింగ్‌ అనే ఆటగాడి కుడి కాలిపై తుపాకీతో ఉన్న టాటూకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తుపాకీ.. మారణాయుధాన్ని టాటూగా వేసుకుని ప్రపంచకప్‌లో పాల్గొనడం సరికాదంటూ పలువురు సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలుస్తున్నారు. తుపాకీ వాడకానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతోన్న లూపీ కోప్‌ మాట్లాడుతూ..'వీలైనంత త్వరగా రహీమ్ తన కాలిపై ఉన్న తుపాకీతో కూడిన టాటూను తీసేయాలి.. లేదంటే అతన్ని ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతించ వద్దు'అని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై రహీమ్ స్పందిస్తూ... 'తనకు రెండేళ్ల వయసులో తండ్రి మరణించారని.. అప్పుడు తాను జీవితంలో తుపాకి ముట్టుకోను అనే వాగ్ధానంతో ఈ టాటూ వేసుకున్నానని.. ఈ టూటూకు అంతర్గతంగా గొప్ప భావన ఉంది' అని తెలిపారు. అక్కడి పుట్ బాల్ అసోసియేషన్ కూడా  రహీమ్ కు మద్దతుగా నిలిచింది.