ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదు :నవ్య స్వామి

ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదు :నవ్య స్వామి

హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువ శాతం జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదవుతున్నాయి. దాంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ తరవాత కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో షూటింగ్ లను సైతం మొదలు పెట్టారు. ఇప్పటికే ముగ్గురు సీరియల్ నటీనటులు కూడా కరోనా భారిన పడ్డారు. వారిలో సీరియల్ నటి నవ్య స్వామి కూడా ఒకరు. అయితే ఆమె తాజాగా ఈ విషయం పై స్పందిస్తూ..కరోనా రావటం సిగ్గుపడాల్సిన, భయపడాల్సిన విషయం కాదన్నారు. ఇలాంటప్పుడే దైర్యంగా ఉండాలని, ఇతరులు చేసే కామెంట్లను పట్టించుకోవద్దని తెలిపారు. ఎవరికీ వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని, వ్యాధి భారిన పడేకంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించాలని, మీ ప్రేమ, అభిమానాల వల్ల ప్రస్తుతం నేను బాగానే ఉన్నానని అన్నారు. త్వరలోనే మరింత స్ట్రాంగ్‌గా మీ ముందుకు వస్తానని ఆమె తెలిపారు. కాగా ప్రస్తుతం నవ్య స్వామి ‘నాపేరు మీనాక్షి’, ‘ఆమె కథ’ సీరియల్స్ లో నటిస్తున్నారు.