పీఎంకేర్‌కు ఏడాదిపాటు విరాళం ఇవ్వండి.. ఉద్యోగులను కోరిన కేంద్రం

పీఎంకేర్‌కు ఏడాదిపాటు విరాళం ఇవ్వండి.. ఉద్యోగులను కోరిన కేంద్రం

కరోనా వైరస్ అన్ని దేశాల ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేస్తోంది.. లాక్‌డౌన్‌తో అత్యవసర సర్వీసులు తప్ప అన్నీ మూతపడడంతో కొందరి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అయితే.. విరాళాల సేకరణపై దృష్టిసారించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రెవిన్యూ విభాగం ఉద్యోగులు ప్రతినెలా ఒకరోజు వేతనాన్ని ఏడాదిపాటు పీఎంకేర్‌కు విరాళం ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ కోరింది. రెవిన్యూ విభాగంలోని అధికారులు, ఉద్యోగులంతా 2021 మార్చి వరకు ప్రతినెలా ఒకరోజు వేతనాన్ని పీఎం కేర్‌కు విరాళంగా ఇవ్వాలంటూ అంతర్గతంగా జారీచేసిన సర్క్యులర్‌లో విజ్ఞప్తి చేసింది. ఈ వినతిని ఎవరైనా వ్యతిరేకిస్తే రెవిన్యూ విభాగంలోని డిస్ట్రిబ్యూషన్‌ అధికారికి తెలుపాలని సూచించింది. అయితే, కొంతమంది ఇందుకు సుముఖంగా ఉన్నా.. చాలా వరకు ఈ విధాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కరోనాతో ముందు ఎలాంటి ఉపద్రవాలు వస్తాయేమోనన్న భయంతో.. కొన్ని రాష్ట్రాలు మాత్రం.. అత్యవసర సేవల్లో ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తూనే.. మరోవైపు మిగతా ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతున్నాయి.