ట్రంప్ - కిమ్ భేటీకి వేళాయే!

ట్రంప్ - కిమ్ భేటీకి వేళాయే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ త్వరలోనే భేటీ కానున్నారు... ఎప్పుడు భేటీ అయ్యేది ఖరారు కాకపోయినా సమావేశం జరగడం మాత్రం ఖాయమైంది. ఉత్తరకొరియా అధినేత కిమ్‌తో భేటీకి ముహూర్తం ఖరారైందన్నారు ట్రంప్... తేదీ, వేదికను మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. త్వరలోనే ఈ భేటీ ఉంటుందన్న ట్రంప్... వేచిచూడాలంటూ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. గతంలో తీవ్రవిమర్శలు చేసుకున్న ఈ ఇరువురు నేతలు... అమెరికా, ఉత్తర కొరియా మధ్య యుద్ధం తప్పదని హెచ్చరించుకున్నారు. మేం రెడీ అంటే... ఇదిగో దాడి చేస్తున్నామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉప్పు, నిప్పుగా మారిపోయారు... దీంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.