శ్రీకాకుళంలో వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం..రోడ్డుపై వాడేసిన పీపీఈ కిట్లు !

శ్రీకాకుళంలో వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం..రోడ్డుపై వాడేసిన పీపీఈ కిట్లు !

శ్రీకాకుళంలో వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. నగరపరిధిలోని చౌక్ బజార్ లో పీపీఈ కిట్లను వాడి జనావాసాలకు దగ్గరే పడేసారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి 50 అడుగుల దూరంలోనే రోడ్డు పై పీపీఈ కిట్లు కనిపించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇటీవల చౌక్ బజార్ కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ యువకుడు హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. కాగా ఆ పిపిఈ కిట్లను ఆ యువకుడికే వైద్యం చేసి భయట పడేసినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇక ప్రజలు భయాందోళన చెందటంతో పారిశుధ్యకార్మికులు అక్కడకు చేరుకొని వాటిని తీసి వేశారు. ఇక ఇప్పటికే ఆ ప్రాంతంలో కేసులు నమోదైన నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కేసులు పెరుగుతున్న వేళ పీపీఈ కిట్లను నిర్లక్ష్యంగా రోడ్డు పై పడేయడంతో నగర వాసుల్లో ఆందోళన నెలకొంది.