ఈ పూరి సూపర్ హిట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా? 

ఈ పూరి సూపర్ హిట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా? 

పూరి జగన్నాథ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూరి మొదటి సినిమా బద్రి నుంచి చూసుకుంటే దేనికదే వెరైటీగా ఉంటుంది.  హీరోయిన్లను ఆవిష్కరించే తీరు వేరుగా ఉంటుంది.  అందుకే పూరి సినిమాల్లో పనిచేసిన హీరోయిన్లు ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు.  పూరి... రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది.  

అప్పట్లో ఈ మూవీ ఓ ఊపు ఊపింది.  సినిమా బంపర్ హిట్ కావడమే కాదు.  అందులోని ప్రతి డైలాగ్ యువకులను మెప్పించింది.  ఈ ఇడియట్ సినిమాలో కన్నడ భామ రక్షితను హీరోయిన్ గా తీసుకున్నారు.  ఆమె అద్భుతంగా నటించింది.  మొదటి సినిమాతోనే అముఞ్చి విజయం అందుకున్న రక్షిత ఆ తరువాత కొన్ని సినిమాలు మాత్రమే చేయగలిగింది.  సినిమాల నుంచి తప్పుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.  పెళ్లి తరువాత చాలామంది హీరోయిన్లు ఏం చేస్తున్నారు అనే విషయం పెద్దగా బయటకు తెలియదు. అలానే రక్షిత విషయంలో కూడా.  అయితే, ఇటీవలే రక్షిత సడెన్ గా మీడియాకు కనిపించింది.  ఆమె హీరోయిన్ రక్షితనా కాదా అనే విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టి ఉంటుంది.  రక్షిత పూర్తిగా మారిపోయింది.  ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అవకాశాల కోసం డైట్ మెయింటైన్ చేసే స్టార్స్, పెళ్లి తరువాత దానిని ఫాలో అవ్వరు.  అందుకే గుర్తు పత్తాలేకుండా మారిపోతారు.  ఇందుకు రక్షిత ఓ ఉదాహరణ.  కావాలంటే ఫోటో చూడండి.