కిమ్ సోదరి గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు... 

కిమ్ సోదరి గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు... 

ఇప్పుడు రెండే రెండు పదాలు ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి అందులో ఒకటి కరోనా, రెండోది కిమ్.  కరోనా ప్రపంచాన్ని ఎలాగైతే భయపెడుతున్నదో కిమ్ కూడా ప్రపంచాన్ని అదే రీతిలో భయపెడుతున్నాడు.  2011 నుంచి కిమ్ ఉత్తర కొరియాను పాలిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు తెలియకుండా ఒక్క వార్త కూడా బయటకు వెళ్ళదు.  చెప్పిందే వేదం చేసిందే శాసనం.  అంతలా ఆ దేశాన్ని నడిపిస్తున్నాడు.  ప్రస్తుతం అయన ఆరోగ్యం బాగాలేదని, హార్ట్ ఆపరేషన్ తరువాత బ్రెయిన్ డెడ్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.  

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం అఫీషియల్ గా ఆ దేశం మీడియా కన్ఫర్మ్ చేస్తేనేగాని తెలియదు.  ఒకవేళ కిమ్ మరణిస్తే ఆయన తరువాత ఆ దేశాన్ని నడిపించేది ఎవరు అనే విషయం కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.  కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ పగ్గాలు చేపడుతుంది.  ఆమె ఎవరు? దేశాన్ని పాలించే సత్తా ఆమెకు ఉందా అనే దానికి కొన్ని భయానకమైన నిజాలు బయటకు వస్తున్నాయి.  కిమ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే సోదరికి పార్టీలో కీలక పదవిని కట్టబెట్టాడు.  తన తరువాత అవసరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఆమెకు పగ్గాలు అప్పగించాడు.  పార్టీలో ఆమె కీలక సభ్యురాలిగా మారిపోయింది.  దక్షిణ కొరియాను డైరెక్ట్ గా కుక్కలు మొరుగుతున్నాయని హెచ్చరించిన వైనం చూస్తుంటే ఆమె ఎంతటి సమర్దురాలో అర్ధం చేసుకోవచ్చు.  

కరోనా విషయంలో కలిసి పనిచేద్దామని ట్రంప్ లేఖ రాస్తే, దానికి ఆమె ఇచ్చిన సమాధానం చాలు ఆమె ఎంతటి కఠినమైన నాయకత్వం కలిగిన నాయకురాలో చెప్పడానికి.  కిమ్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఆమె హస్తం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  హెచ్చరికలు చేయడంలో, శతృవులను భయపెట్టడంలో, ప్రజలను నడిపించడంలో ఆమె ఆరితేరిందని, దేశాన్ని పరిపాలించదగిన సత్తా కిమ్ యో జోంగ్ కు ఉందని అంటున్నారు.  కిమ్ కు ఇద్దరు సోదరులున్నప్పటికీ ఇద్దరు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  నలుగురు సంతానంలో కిమ్ జోంగ్ ఉన్ మూడో వాడు కాగా, కిమ్ యో జోంగ్ ఆఖరి అమ్మాయి.  చివరి ఇద్దరు ఉత్తర కొరియాను శాసిస్తున్నారు.