పన్నీర్, పళనిస్వామి నిరాహార దీక్షపై స్టాలిన్ ఫైర్..!

పన్నీర్, పళనిస్వామి నిరాహార దీక్షపై స్టాలిన్ ఫైర్..!

తమిళనాడు రాష్ట్రంలో కావేరి వివాదం నడుస్తుంది. ఈ ఘటనపై ఈరోజు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నిరాహార దీక్షలో కూర్చున్నారు. కేంద్రం కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ అన్నాడీఎంకే పార్టీ చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం పాల్గొన్నారు. అయితే ఈ రోజు ఉదయం దీక్షా ప్రాంగణానికి చేరుకోవడంతో వీరిని చూసి పార్టీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ముందుగా రూపొందించిన దీక్షలో పాల్గొనే అన్నాడీఎంకే నేతల జాబితాలో వీరి పేర్లు లేవు. కానీ ఉన్నట్టుండి దీక్షా వేదిక వద్దకు వీరిద్దరూ వచ్చి నిరాహార దీక్షలో పాల్గొనడంతో అంతా ఖంగుతిన్నారు. కాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిరాహారదీక్షలో పాల్గొనడంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మండిపడ్డారు. ఆరువారాల్లోగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.