పవన్ కల్యాణ్ వి నిరాధార ఆరోపణలు : బాబు

పవన్ కల్యాణ్ వి నిరాధార ఆరోపణలు : బాబు

ఇన్‌చార్జ్ మంత్రులు బాధ్యతగా ఉంటే ప్రతి జిల్లాలోనూ అనేక సమస్యలు పరిష్కరించవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ సమవేశంలో ఆయన నేతలకు దిశనిర్దేశం చేశారు. ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల్లో తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శ పైనా  స్పందించాల్సిన అవసరం లేదని బాబు అభిప్రాయపడ్డారు. అంశం తీవ్రతను బట్టి స్పందించాలన్నారు. టీడీపీకి బీసీలు ప్రధాన ఓటు బ్యాంకు అని, ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు మరింత యాక్టివ్‌ కావాలని సూచించారు. రాష్ట్రంలో బూత్‌ కమిటీలు 55 శాతం ఖరారయ్యయని మంత్రి లోకేష్‌ తెలిపారు. మిగిలన చోట్ల వేగవంతం చేయాలని సూచించారు. బూత్ వారీ ఓటరు లిస్టు పైన జిల్లా నేతలు పూర్తిగా పట్టు సాధించాల్సిన అవసరం ఉందని లోకేష్‌ అభిప్రాయపడ్డారు. 

ఈవీఎంల విషయంలో జాగ్రత్త..
ఎన్నికలు సమీపిస్తున్నందున ఈవీఎంల విషయంలో అవగాహన పెంచుకోవాలని యనమల సూచించారు. క్యాడర్‌ను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలన్నారు. మన రాష్ట్రంలోనూ ఈవీఎంలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్నారు. యనమల చెప్పింది నిజమేనని, ఈవీఎంల దుర్వినియోగానికి చాలా అవకాశాలున్నాయని చంద్రబాబు అన్నారు.

 
నాకు పని లేక వచ్చానా?
సమావేశానికి పలు జిల్లాల నేతలు గైర్హాజరవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎందుకు హజరు కాలేదని జిల్లా అధ్యక్షులను ప్రశ్నించారు. 'మీ నేతలు అంత బిజీగా ఉన్నారా?' అని అడిగారు. 'నాకు పనిలేక సమావేశానికి వచ్చానా? సెక్రటేరియట్లో నాకు చాలా పనులు ఉన్నాయి. రెండు గంటలు కూడా సమావేశానికి రానివారికి కూడా పదవులు అవసరమా?' అంటూ విరుచుకుపడ్డారు.