ఎన్టీఆర్ స్క్రిప్ట్ మార్చబోతున్నాడా?

ఎన్టీఆర్ స్క్రిప్ట్ మార్చబోతున్నాడా?

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో బాలకృష్ణ 'ఎన్టీఅర్' బయోపిక్ చేయనున్న సంగతి తెలిసిందే. ముందుగా దర్శకుడు తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నారు కానీ కొన్ని అభిప్రాయబేధాల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు తేజ స్థానంలో దర్శకుడు క్రిష్ రాబోతున్నాడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. 

ఆ స్క్రిప్ట్ చదివిన క్రిష్ ఇప్పుడు కథను మార్చే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. క్రిష్ కు స్క్రిప్ట్ సంతృప్తిగా అనిపించకపోవడం మొత్తం కథను రీరైట్ చేయాలని బాలయ్యకు చెప్పాడట. దానికి ఆయన కూడా ఒప్పుకున్నారని సమాచారం. ఎన్టీఆర్ అభిమానులు ఆశించే అంశాలతో ఈ సినిమాను రూపొందించనున్నారు. వివాదాలకు దూరంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. సావిత్రి బయోపిక్ కు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.