సవ్యసాచితో చైతూ రేంజ్ మారుతుందా..?

సవ్యసాచితో చైతూ రేంజ్ మారుతుందా..?
ఇటీవల కాలంలో తెలుగులో వినూత్నమైన కథాంశాలతో కూడిన సినిమాలు వస్తున్నాయి.  ఇలా వచ్చిన సినిమాల్లో కార్తికేయ ఒకటి.  ఈ సినిమా ద్వారా చందు మొండేటి వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాను తెలుగులో ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా రీమేక్ చేసి అందరి మన్ననలు పొందాడు.  హిట్ కోసం పరితపిస్తున్న నాగచైతన్యకు ఈ సినిమా మంచి ఊరటను ఇచ్చింది.  
ప్రేమమ్ మంచి హిట్ కావడంతో.. నాగ చైతన్యతో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు.  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది.  సవ్యసాచి సినిమాతో నాగ చైతన్య పరిణితి చెందిన నటుడిగా మారడం ఖాయమని చందు అంటున్నాడు. నటుడిగా నాగ చైతన్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని చందు అంటున్నాడు.  ఒక చేయి తన ఆధీనంలో ఉండని కుర్రాడిగా నాగ చైతన్య కనిపిస్తాడని, ఆ పాత్రలో నాగచైతన్య అద్బుతంగా నటించాడని చందు ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.  తమిళ స్టార్ నటుడు మాధవన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.