సుశాంత్‌ సినిమాను  థియేటర్లలో రిలీజ్ చెయ్యాలి

సుశాంత్‌ సినిమాను  థియేటర్లలో రిలీజ్ చెయ్యాలి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హ‌ఠాత్తుగా ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. అత‌ని మ‌ర‌ణంతో యావ‌త్ భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ మునిగిపోయింది. సుశాంత్ మర‌ణానికి ప్ర‌ధాన కార‌ణం నెపోటిజ‌మ్ అని బాలీవుడ్ ఇండస్ట్రీపై నెటిజ‌న్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.ఇదిలా వుంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చివ‌రి చిత్రం ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‌‌`దిల్ బెచారా` పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ముఖేష్ చాబ్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జూలై 24న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు.కాగా సుశాంత్‌ ఆఖరి చిత్రం థియేటర్లలో విడుదల చేయాలని బాలీవుడ్‌ నటుడు దిల్జీత్‌ దోసాంజ్‌ అభిప్రాయపడ్డాడు.ఈ చిత్రం విడుదల కావాల్సింది ఓటీటీలో కాదని, చాలా మంది అభిమానులు కూడా  ఇదే కోరుతున్నారని దిల్జీత్‌ దోసాంజ్‌ చెప్పారు. సుశాంత్‌ను నేను రెండుసార్లు కలిశాను. అతను గొప్ప వ్యక్తి. అతని సినిమా ఖచ్చితంగా  చూస్తానని దిల్జీత్‌ దోసాంజ్ అన్నారు.