రాజుగారి అంచ‌నా త‌ల్ల‌కిందులు!

రాజుగారి అంచ‌నా త‌ల్ల‌కిందులు!

అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌దొక్క‌టి..
ఏ సినిమా హిట్ కొడుతుంది? ఏది ఫ్లాప‌వుతుంది? అన్న‌ది ముందే చెప్పేయ‌డం అంత సులువు కాదు. కొమ్ములు తిరిగిన ట్రేడ్ పండితులే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇలాంటి నాన్ గ్యారెంటీ ప‌రిశ్ర‌మ‌లో ప‌క్కాగా గ‌ణాంకం తెలిసిన అనుభ‌వ‌జ్ఞుడిగా, అజేయుడిగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత, పంపిణీదారుడు దిల్‌రాజు. ఆయ‌న స్క్రిప్టు జ‌డ్జిమెంట్‌, సినిమా నిర్మాణంలో సుదీర్ఘ అనుభ‌వంపై ప‌రిశ్ర‌మ‌లో ఓ న‌మ్మిక‌. అయితే రాజుగారే ఊహించ‌లేనిది జ‌రిగింది. తానొక‌టి త‌లిస్తే.. అన్న చందంగా ఇటీవ‌లి సినిమాల బాక్సాఫీస్ రిజ‌ల్ట్ ఊహించ‌ని షాకిచ్చింది.

వాస్త‌వానికి `మ‌హాన‌టి` ప్రివ్యూ చూసి ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట‌వ్వ‌ద‌ని దిల్‌రాజు వ‌దులుకున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే పూరి వార‌సుడు ఆకాష్ న‌టించిన `మెహ‌బూబా` వీక్షించిన దిల్‌రాజు ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయం అని న‌మ్మి 9 కోట్లకు నైజాం హ‌క్కులు కొన్నారు. కానీ ఊహాతీతంగా ఈ సినిమా ఫ‌లితం ప్ర‌తికూలంగా వ‌చ్చింది. మెజారిటీ పార్ట్‌ గురి త‌ప్ప‌ని రాజుగారు.. ఈసారి గురి త‌ప్పారు. అంచ‌నా త‌ల్ల‌కిందులైంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో మాట్లాడుకుంటున్నారు. `మ‌హాన‌టి` జైత్ర‌యాత్ర సాగిస్తుంటే, `మెహ‌బూబా` ఫ‌లితం తారుమారైంద‌న్న టాక్ ట్రేడ్‌లో వినిపిస్తోంది. రాజుగారు అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌దొక్క‌టి.. అంటూ మాటా మంతీ సాగుతోంది. త‌దుప‌రి మ‌రో మూడు సినిమాలు దిల్‌రాజు రిలీజ్ చేయ‌నున్నారు. రాజ్ త‌రుణ్ `రాజుగాడు`, రామ్ `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే`, నితిన్ `శ్రీ‌నివాస క‌ళ్యాణం`. ఈ సినిమాల ఫ‌లితం రాజుగారి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఉంటుందో లేదో చూడాలి.