కొలంబియాలో విచిత్రమైన ఆంక్షలు... వాళ్ళు మాత్రమే బయటకు రావాలి... 

కొలంబియాలో విచిత్రమైన ఆంక్షలు... వాళ్ళు మాత్రమే బయటకు రావాలి... 

ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతున్నది.  కరోనా వైరస్ వలన ప్రపంచం ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఆర్ధికంగా ఎంత లాస్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  2019 లో మొదలైన ఆర్ధిక మాంద్యం దెబ్బకు చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కరోనా వైరస్ మరింత పడుతున్నది.  కరోనా వైరస్ కు ఇప్పటి వరకు సరైన మందు కనుగొనలేదు.  దీంతో లాక్ డౌన్ విధించి సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.  

అయితే, ఒక్కో దేశం ఒక్కో విధంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నది.  లాక్ డౌన్ లో భాగంగా కొలంబియా దేశం అమలు చేస్తున్న నిబంధనలు విచిత్రంగా ఉన్నాయి.  అదేమంటే, కొలంబియా జాతీయ గుర్తింపు కార్డులోని చివరి సంఖ్యల ఆధారంగా బయటకు వెళ్లేందుకు నిబంధనలు పెట్టింది.  గుర్తింపు కార్డులో 0,7,4 ఉంటె వాళ్ళు సోమవారం రోజున బయటకు రావొచ్చు.  అదీకూడా నిర్ణయించిన సమయంలో మాత్రమే.  అలానే, 1,8,5 సంఖ్యలు ఉన్న వాళ్ళు మంగళవారం రోజున బయటకు వెళ్లేలా నిబంధనలు పెట్టింది.  అందరూ ఒకేసారి బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశం ప్రకటించింది.  ప్రసుతం కొలంబియాలో 1500 మంది కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.  వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు ఈ విధమైన చర్యలు తీసుకుంది.  అటు బొలివియా దేశం కూడా ఇదే విధమైన నిబంధనలు విధించింది.