డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోని ఫ్రెండ్.. ఎవరో తెలుసా?

డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోని ఫ్రెండ్.. ఎవరో తెలుసా?

టీమిండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఏదిచేసినా సంచనలమే. తన కూల్ కెప్టెన్సీతో మైదానంలో సహచర ఆటగాళ్లను గైడ్ చేసే ధోని.. డ్రెస్సింగ్‌ రూమ్‌ లో మాత్రం చాలా సరదాగా ఉంటాడు. అందుకు నిదర్శనమే తాజా ఘటన. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ సెక్యూరిటీ డాగ్ గోల్డెన్ రిట్రీవర్‌ని పట్టుకుని ధోనీ డ్రెస్సింగ్‌ రూమ్‌ అంతా తిరిగాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు తన ఫ్రెండ్ వచ్చిందంటూ సహచర ఆటగాళ్లకు పరిచయం చేశాడు. అయితే ఈ కుక్క అంటే ధోనీకి చాలా ఇష్టం. దీన్ని 2013లో ఎంసీఏ నుంచి దత్తత తీసుకోవాలని కూడా అనుకున్నాడు.. కానీ కుదరలేదు. హోమ్ గ్రౌండ్ లో వివాదాలు ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం హోమ్ గ్రౌండ్ ఐపీఎల్‌ మ్యాచ్‌లను పూణేలో ఆడుతుంది చెన్నై. ఈ క్రమంలో ఈ కుక్క మళ్లీ ధోనీ కంట పడింది. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.