ధోని ఖాతాలో మరో రికార్డు

ధోని ఖాతాలో మరో రికార్డు

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్‌గా ధోని రికార్డు సృష్టించాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ధోని ఈ అరుదైన ఫీట్ సాధించాడు. సన్‌రైజర్స్  బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. చెన్నై బౌలర్ కర్ణ్‌శర్మ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్‌ను స్టంపౌట్ చేయడంతో ఈ మైలురాయి అందుకున్నాడు ధోని. తాజా స్టంపింగ్ తో.. ఐపీఎల్‌లో ధోని ఖాతాలో స్టంపింగ్స్ సంఖ్య 33కు చేరింది. ఇంతకు ముందు ఈ ఘనత కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప(32) పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్(30), వృద్ధిమాన్ సాహా(18) ఉన్నారు.

Photo: FileShot