జడ్డూను భయపెట్టిన ధోనీ...

జడ్డూను భయపెట్టిన ధోనీ...

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో.. సహచర ఆటగాళ్లతో అంతే సరదాగా ఉంటాడు. అప్పుడప్పుడు జట్టు ఆటగాళ్లతో సరదా పనులు కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం కెమెరాకు చిక్కింది. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో ఈ ఘటన జరిగింది.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో హర్భజన్‌ సింగ్‌ వేసిన చివరి బంతిని శిఖర్‌ ధావన్ మిడ్‌వికెట్ దిశగా కొట్టాడు. ఆ బాల్‌ను పరుగెత్తుకుంటూ వెళ్లి ధోని ఆపాడు. మరోవైపు డీప్ మిడ్‌వికెట్ నుంచి జడేజా కూడా పరుగెత్తుకు వచ్చాడు. ముందుగా బాల్ అందుకున్న ధోనీ.. జడేజాను ఆటపట్టించాలని బంతిని అతనిపై విసురుతున్నట్లు భయపెట్టాడు. ఈ ఘటన తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు. వీరితో పాటు కామెంటేటర్లు, స్టేడియంలోని ప్రేక్షకులు కూడా నవ్వుల్లో మునిగితేలారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్లే ఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకున్న చెన్నై తర్వాతి మ్యాచ్‌ను దిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడనుంది. 

Photo: FileShot