జగన్ ముద్దులు చూసి జనం నవ్వుకుంటున్నారు...

జగన్ ముద్దులు చూసి జనం నవ్వుకుంటున్నారు...

పాదయాత్రలో వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముద్దులు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు. ఆదివారం దేవినేని మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసన ఎదురైతే జగన్ ఉలిక్కిపడుతున్నారు అని అన్నారు. పట్టిసీమపై సమాధానం చెప్పకుండా జగన్ వెళ్ళిపోతున్నాడని విమర్శించారు. జగన్‌ ఒళ్లు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ మదంతో మాట్లాడుతున్నారని.. ఇంత పెద్ద విజవాడలో చిట్టినగర్ సందులో చిట్టి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని విమర్శించారు. బాంబులు పెట్టి కొల్లేరును ధ్వంసం చేసిన చరిత్ర జగన్ తండ్రిది కాదా అని  దేవినేని ఉమ అన్నారు.

జగన్ పాదయాత్రలో ఒక్క విజ్ఞప్తి తీసుకున్నారా.. ఉంటే అవన్నీ బయట పెట్టాలి అని డిమాండ్ చేసారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ముద్దులు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. పట్టిసీమపై విమర్శలు చేసిన జగన్ ఇప్పటికయినా క్షమాపణ చెప్పాలన్నారు. పట్టిసీమ ఫలాలు ఎలా ఉన్నాయో జగన్ కృష్ణ జిల్లా పాదయాత్రలో చూసైనా వాస్తవాలు మాట్లాడాలి అని దేవినేని అన్నారు. పట్టిసీమ దండగ అన్న జగన్ జిల్లా  వాసులకు సమాధానం చెప్పి పక్క జిల్లాకు వెళ్ళాలని పేర్కొన్నారు. కరువు కాలంలో 150 టీఎంసీ  నీళ్లు ఇచ్చిన ప్రాజెక్ట్ పై విమర్శలు దారుణం అని ధ్వజమెత్తారు. పట్టిసీమ నీళ్లు వల్లే ఈ రోజు చెరువులు నింపాము అని గుర్తు చేశారు. మరోవైపు బెంజ్ సర్కిల్‌లో ఫ్లైఓవర్ పిల్లర్ పనులు పూర్తి అయిన వెంటనే కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని మళ్లీ పునఃప్రతిష్టిస్తామని చెప్పారు. బెంజ్ సర్కిల్‌కి కాకాని వెంకటరత్నం పేరు పెడతామన్నారు.