గవర్నర్ కు స్వాగతం పలకని చంద్రబాబు

గవర్నర్ కు స్వాగతం పలకని చంద్రబాబు

జగన్ కోడికత్తి వ్యవహారంలో గవర్నర్ నరసింహన్, ఏపి సిఎం చంద్రబాబు మధ్య తలెత్తిన విభేదాలు ఇంకా సద్దుమణగ లేదు. రోజురోజుకీ వారిద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే మంత్రివర్గ విస్తరణ కోసం విజయవాడకు వచ్చిన గవర్నర్ నరసింహన్ కు  ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలకలేదని తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ మీద కోడికత్తి కేసులో గవర్నర్ వైఖరిపై కినుక వహించిన చంద్రబాబు గుర్రుగానే ఉన్నారు. ఎంతో మంది గవర్నర్లతో సఖ్యతగా ఉన్న చంద్రబాబుకు నరసింహన్ వైఖరి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.  ఆ కారణంగానే చంద్రబాబు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్వాగతం పలకడానికి వెళ్లలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉదయం మంత్రివర్గ విస్తరణ కోసం విచ్చేసిన గవర్నర్ కు మంత్రి అచ్చెన్నాయుడు, మేయర్ కోనేరు శ్రీధర్, డిజిపి ఠాకూర్ స్వాగతం పలికారు.