డెడ్‌పూల్ 2 .. త‌ర‌ణ్ రివ్యూ ఇదే

డెడ్‌పూల్ 2 .. త‌ర‌ణ్ రివ్యూ ఇదే

ట్విట్ట‌ర్, ఎఫ్‌బి ఖాతాల్లో వ‌న్‌వ‌ర్డ్ రివ్యూల పేరుతో సినిమాల్ని కైమా కొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి వేళ కూడా 
కొంద‌రు సీనియ‌ర్ క్రిటిక్స్ ప‌రిశ్ర‌మ‌ను బ‌తికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మెజారిటీ భాగం వాస్త‌విక‌త‌ను ప్ర‌తిబింబించేలా స‌మీక్ష‌లు ఇస్తున్నారు. అలాంటివారిలో బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌కి ప్ర‌త్యేక గుర్తింపు, గౌర‌వం ఉంది. సినిమాల వ‌న్‌వ‌ర్డ్ రివ్యూలు, క‌లెక్ష‌న్ల రిపోర్ట్ అందిస్తూ నిరంత‌రం ఆయ‌న అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటారు. 

రెగ్యుల‌ర్‌గా ఆయ‌న బాలీవుడ్, హాలీవుడ్ స‌హా ఇత‌ర ప్రాంతీయ భాషా చిత్రాల వ‌న్‌వ‌ర్డ్ రివ్యూల్ని, బాక్సాఫీస్ రిపోర్టుల్ని అందిస్తున్నారు. లేటెస్ట్ హాలీవుడ్ రిలీజ్ `డెడ్‌పూల్ 2`పైనా త‌ర‌ణ్ వ‌న్‌వ‌ర్డ్ రివ్యూ అందించారు. ``డెడ్‌పూల్ 2: విన్న‌ర్‌` .. డైన‌మిక్ యాక్ష‌న్‌.. విక్డ్‌ కామెడీ.. ఈ సినిమా విజ‌యానికి కార‌ణం. ర‌ణ‌వీర్ సింగ్ వాయిస్ వోవ‌ర్ డెడ్‌పూల్‌కి అస్సెట్  ..2గంట‌ల యాక్ష‌న్ కామెడీ ఆక‌ట్టుకుంటుంది`` అని ట్వీట్‌లో వ‌న్‌వ‌ర్డ్ స‌మీక్ష‌ను అందించారు.