ప్రభుత్వాస్పత్రిలో డెడ్ బాడీ మాయం...కొత్తగూడెంలో ఘటన.!

ప్రభుత్వాస్పత్రిలో డెడ్ బాడీ మాయం...కొత్తగూడెంలో ఘటన.!

భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో ఓ డెడ్ బాడీ మాయమమైన ఘటన కలకలం రేపుతోంది. కొత్తగూడానికి చెందిన గుగులోతు శివ(14) పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడు. వెంటనే బాలున్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు సిబ్బంది సిద్దమవ్వగా డెడ్ బాడీ కనిపించకుండా పోయింది. దాంతో ఆస్పత్రి సిబ్బంది పోలిసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులే డెడ్ బాడీని తీసుకెళ్లారని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. పగడ్బందీగా ఉన్న సెక్యూరిటీ మధ్య శవాన్ని ఎలా తరలించారని అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.