దలైలామా పరిస్థితి విషమం

దలైలామా పరిస్థితి విషమం

ఆధ్యాత్మిక గురువు దలైలామా పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్నాళ్లుగా ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. రెండేళ్లుగా ఆయన అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. దలైలామా వయస్సు 82 ఏళ్లు. ఏడాది నుంచి భారత ప్రభుత్వం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. చైనా ప్రభుత్వం కూడా ఆయన ఆరోగ్య విషయాన్ని భారత్ కు తెలియజేస్తోంది. అయితే... సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. దలైలామా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్య్టా గత కొన్నాళ్లుగా ఎవరిని కలవటం లేదు. భారత ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఆయన ఆరోగ్య  పరిస్థితులపై ఆరా తీసింది. దలైలామా ఆరోగ్య పరిస్థితులపై పలు దేశాల్లోని ఆయన భక్తులు ఆందోళన చెందుతున్నారు.