ఆగష్టు 2, 2020 ఆదివారం దినఫలాలు 

ఆగష్టు 2, 2020 ఆదివారం దినఫలాలు 

మేషం: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్య ఫలితాలు. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్ర లాభాలు. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి.
 
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వెంకటేశ్వర స్వామికి పెరుగన్నం నివేదన చేయండి.  

కర్కాటకం: ఆస్తి తగాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. నవధాన్యాల జలంతో శివాభిషేకం చేయాలి.  

సింహం: రుణదాతల ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో చర్చలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. చదువు చెప్పిన గురువులకు కానుకలు సమర్పణ చేయండి.  

కన్య: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభ సూచనలు. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. మందారం పుష్పాలతో సుబ్రమన్య ఆరాధన చేయాలి.  

తుల: శ్రమకు ఫలితం కనిపించదు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. మహాలక్ష్మి అమ్మవారికి తెల్లని పుష్పాలు సమర్పణ చేయండి.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. విష్ణు పంజరీ సోత్రం పారాయణ చేయండి.

ధనుస్సు: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువిరోధాలు. సోదరులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. పేదలకు బియ్యం దానం చేయండి.  

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనసౌఖ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పేదలకు గోధుమ రొట్టెలు దానం చేయండి.

కుంభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా కొనసాగుతారు. విషు సహస్రనామాలు చెప్పండి.
 
మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి. మహాలక్ష్మి అమ్మవారికి పటిక బెల్లం నివేదన చేయండి.