రానాకు ముఖ్యమంత్రిగా మరో అవకాశం..!!

రానాకు ముఖ్యమంత్రిగా మరో అవకాశం..!!

దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.  రాజకీయాలకు సంబంధించిన ఆ సినిమాలో రానా ముఖ్యమంత్రి పాత్రను పోషించారు.  లీడర్ గా మెప్పించిన రానా ఆ తరువాత బిజీగా మారిపోయాడు.  బాహుబలితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొని జాతీయ స్థాయి నటుడిగా మారిపోయాడు.  కాగా, ఇప్పుడు రానాకు ముఖ్యమంత్రిగా నటించే అవకాశం వచ్చింది.  అదీ బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో.  

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమౌతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది.  ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న బాలకృష్ణకు జోడిగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రగా చెప్పుకునే నాదెండ్ల భాస్కరరావు పాత్రకోసం బొమన్ ఇరానీని తీసుకున్నారు.  ఎన్టీఆర్ జీవిత చరిత్రలో మరో ముఖ్యమైన పాత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.   ఈ పాత్రలో రానా దగ్గుబాటిని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రకు రానా సరిగ్గా సరిపోతాడన్నది దర్శకుడు క్రిష్ ఉద్దేశ్యం.  అందుకే ఆ పాత్రకోసం రానాను సెలెక్ట్ చేశారు.