హైదరాబాద్‌ లో కిలాడీ లేడీ...ఘరానా మోసం !

హైదరాబాద్‌ లో కిలాడీ లేడీ...ఘరానా మోసం !

హైదరాబాద్‌ లో ఘరానా లేడీ బాగోతం వెలుగుచూసింది. బీయస్సీ చదివిన ఓ కిలాడీ లేడీ ఫేస్‌బుక్‌ నుండి ఫోటోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌లకు పాల్పడుతోందని గుర్తించారు పోలీసులు.  పేరున్న పలు స్కూల్స్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌ల నుండి అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలు సేకరించడంతో పాటు ఆ ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి తిరిగి తానే తీసేస్తానంటూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న మాయలేడీని హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చెప్పుకునే ఈ కిలాడీ లేడీ స్కూల్స్‌ కు ఫోటోలను పంపి ఫోన్‌లు చేసి బారీగా నగదు డిమాండ్‌ చేసేది. హైదరాబాద్‌లో పేరున్న నాలుగు స్కూల్స్‌ యాజమాన్యాల ఫిర్యాదుతో రంగంలోగి దిగిన పోలీసులు నిందితురాలిని కటకటాల్లోకి నెట్టారు...నిందితురాలు సెల్‌ఫోన్‌లో దాదాపు 225 కు పైగా స్కూల్స్‌ గ్రూపులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఈజీ మనీ కోసమే ఇలాంటి నేరాలకు పాల్పడిందని సైబర్‌క్రైమ్ పోలీసులు తేల్చారు.

పలు స్కూల్స్ కి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ నుండి స్కూల్ అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలు సేకరించడంతో పాటు ఆ ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి ఆ ఫోటోలను తిరిగి బాధిత స్కూల్స్ కి ఆ లేడీ పంపేది. తాను సైబర్ సెక్యూరిటీ లో పని  చేస్తున్నట్టు నమ్మించి ఈ ఫోటోలు తీసేస్తానని చెప్పి బాధితుల నుండి డబ్బు వసూలు చేస్తుండడంతో హైదరాబాదులో నాలుగు  స్కూల్స్ కి చెందిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో ఉన్నత చదువు చదివి, ఈజీ మనీ కోసం టెక్నాలజీని వాడి ఈ తరహా నేరానికి ఆ యువతి పాల్పడినట్టు తేలింది.