ఐపీఎల్ ఫైనల్ దెబ్బకు వరల్డ్ రికార్డ్ బ్రేక్

ఐపీఎల్ ఫైనల్ దెబ్బకు వరల్డ్ రికార్డ్ బ్రేక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ దెబ్బకు వరల్డ్ రికార్డులు బద్దలైపోయాయి... ఐపీఎల్ అంటేనే క్రేజ్, లీగ్ దశ అయినా, ప్లేఆఫ్ అయినా, క్లాలిఫయర్ అయినా... వీలైతే స్టేడియానికి వెళ్లి చూడాలి... కుదరకపోతే గ్యాంగ్‌ను మొత్తం వేసుకుని టీవీల్లో చూస్తూ ఎంజాయ్ చేయాలి. ఇక ఐపీఎల్ సమయంలో వివిధ హోటళ్లు, రెస్టారెంట్‌లు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ కస్టమర్లను స్పెషల్ ప్యాకేజ్‌లు ఇస్తుంటాయి. ఓవైపు స్మార్ట్‌ఫోన్లు కోకొల్లలు... మొబైల్ డేటా ఆఫర్లతో... ఎక్కడున్నా మొబైల్ లోనే మ్యాచ్ చూస్తూ పండుగ చేసుకోవడం... ఇవన్నీ కలిసి ప్రపంచ రికార్డును సృష్టించాయి. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌...‌ వ్యూయర్‌షిప్ పరంగా కొత్త రికార్డులను నెలకొల్పింది ఐపీఎల్. 

ఒకేసారి ఎక్కువ మంది చూసిన మ్యాచ్‌గా ఐపీఎల్ ఫైనల్ ఫైట్ ప్రపంచ రికార్డు సృష్టించింది. హాట్ స్టార్ మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా ఏకంగా ఒకేసారి 10 మిలియన్ల మంది ఈ ఫైనల్ ఫైట్‌ను చూశారంటే ఐపీఎల్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్లలోనే మ్యాచ్ చూడడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఇక అంతకు ముందు రికార్డు స్థాయిలో చూసిన మ్యాచ్ కూడా హైదరాబాద్, చెన్నై మ్యాచ్ కావడం మరో విశేషం... తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో చెన్నై-హైదరాబాద్‌ తలపడిన మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 8.4 మిలియన్ల మంది వీక్షిస్తే... ఆ రికార్డును బ్రేక్ చేసింది  ఫైనల్ ఫైట్.