ఐపీఎల్‌ ట్రోఫీకి ప్రత్యేక పూజలు

ఐపీఎల్‌ ట్రోఫీకి ప్రత్యేక పూజలు

ఆదివారం ముంబై వేదికగా చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై ఘన విజయం సాధించి ఐపీఎల్‌-11 విజేతగా నిలిచింది. ఆ తర్వాత సోమవారం సాయంత్రం చెన్నై జట్టు సొంత గడ్డకు చేరుకుంది. విజేతగా నిలిచిన జట్టు సబ్యులకు చెన్నై విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కప్పును, తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విమానాశ్రయం నుండి నేరుగా హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఆటగాళ్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం చెన్నై టీ.నగర్‌లోని శ్రీవారి ఆలయాన్ని జట్టు ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌ సభ్యులు దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్‌-11 ట్రోఫీకి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కెప్టెన్ ధోనికి అందజేశారు.