మహిళతో వివాహేతర సంబంధం..ఆమె కూతురు పై అత్యాచారం

మహిళతో వివాహేతర సంబంధం..ఆమె కూతురు పై అత్యాచారం

కరోనా తో ప్రపంచమంతా అల్లాడుతుంటే అకృత్యాలు , అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె మైనర్ కూతురిపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలీపురంలో చోటు చేసుకుంది స్థానికంగా నివసించే మహిళకు 2003లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత పదేళ్లుగా భర్తతో విడిపోయిన మహిళ పిల్లలతో నివాసముంటోంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం లో నివాసం ఉంటున్న నరసింహయాదవ్‌ (50) అనే వ్యక్తి ఆ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. కొన్ని రోజులుగా కుమార్తె అనారోగ్యంగా ఉండడంతో ఏం జరిగిందని తల్లి ప్రశ్నించింది. నరసింహ తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఆదివారం బాధితురాలు, తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.