తాంబే రిటైర్మెంట్... మా కోసమే అంటున్న సిపీఎల్..

తాంబే రిటైర్మెంట్... మా కోసమే అంటున్న సిపీఎల్..

ముంబై లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే మా కోసం రిటైర్మెంట్ ప్రకటించాడు అంటుంది కరేబియన్ ప్రీమియర్ లీగ్(సిపీఎల్). అయితే ఈ 48 ఏళ్ల లెగ్ స్పిన్నర్ సిపీఎల్ ప్లేయర్స్ డ్రాఫ్ట్ కోసం తన పేరును పంపించాడు, కానీ బీసీసీఐ నియమాల ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా అన్ని రకాల దేశీయ క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించినట్లయితే ఇతర దేశాలలో జరిగే టీ 20 లీగ్‌లలో ఆడాలనుకునే ఏ ఆటగాడికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది బీసీసీఐ. ఇక ఈ  సిపీఎల్ లీగ్‌లో కాంట్రాక్ట్ సాధించి అందులో ఆడబోతున మొదటి ఆటగాడు ప్రవీణ్ తాంబే. ముంబై సీనియర్ క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) రికార్డుల ప్రకారం, అతను ఇటీవలే పదవీ విరమణ చేసాడు. తరువాత దానిని ఉపసంహరించుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పదవీ విరమణ చేసాడు. ఈ విషయంలో అతను ఎంసిఎకి ఒక లేఖ రాశాడు" ఓ ఎంసిఎ అధికారి తెలిపాడు. అయితే అతను మా లీగ్ లో ఆడటం కోసమే రిటైర్మెంట్ ప్రకటించాడు అని సిపీఎల్ తెలిపింది. తన 41 సంవత్సరాల వయస్సులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన తాంబే 33 మ్యాచ్‌లు ఆడి 30.5 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు.